Drink Water: మనం తాగే నీటికి, మన అందానికి మధ్య లోతైన సంబంధం ఉంది. నీరు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. నీరు తాగే విధానం.. వయస్సు, చర్మంపై ప్రభావం చూపుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ముఖంపై కొత్త కాంతి వస్తుందని అంటారు. అవును, నిజమే అంటున్నారు బ్యూటీషియన్స్. 40 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల వారిగా కనిపించేందుకు తాగే నీరు దోహదపడుతాయని చెబుతున్నారు. అయితే, ఎప్పటికీ యవ్వనంగా ఉండాలంటే నీరు తాగే విధానం తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మరి నీరు ఎలా తాగాలో ఇవాళ మనం తెలుసుకుందాం..
1. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. తిన్న అరగంట తర్వాత నీరు త్రాగాలి. ఆహారం తిన్న తరువాత ఏదైనా తాగాలనిపిస్తే.. నీటికి బదులుగా పాలు, పెరుగు, షికంజి వంటివి తాగొచ్చు.
2. ఒకేసారి ఎక్కువగా నీళ్లు తాగొద్దు. సిప్ సిప్‌గా నీటిని మెళ్లగా తాగాలి. ఇది మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3. చల్లని నీటికి దాదాపు దూరంగా ఉండండి. ఫ్రిజ్‌లో నీళ్లు తాగడం అంత క్షేమం కాదు. వేసవిలో మట్టి కుండలో నీటిని తాగడం మేలు చేస్తుంది.
4. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యాక ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. ఆ తరువాతే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీని ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పోతాయి.
5. నిలబడి నీళ్లు ఎప్పుడూ తాగొద్దు. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా హానీ కలుగుతుంది. అందుకే, కూర్చునే నీళ్లు తాగాలి.
6. మంచి నీళ్లను ఈ విధంగా తాగడం వలన శరీరం హేడ్రైట్‌గా ఉంటుంది. అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉండి.. వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..