
రాత్రి పడుకునే ముందు కాళ్లకు వేసుకునే సాక్స్‌లలో బిరియానీ ఆకు పెట్టుకుని పడుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇంటి చిట్కాగా వైరల్ అవుతోంది. బిర్యానీ ఆకులో ఉండే యూజినాల్ వంటి నిరోధకాలు, ఆరోమాటిక్ నూనెలు పాదాల స్వేద గ్రంథుల ద్వారా ఉపశమనాన్ని ఇస్తాయని భావిస్తారు. అయితే, ఈ చిట్కాకు శాస్త్రీయ నిరూపణలు లేవని, ఇది కేవలం సాంప్రదాయ ప్రత్యామ్నాయ విశ్వాసం లేదా అరోమాథెరపీ ప్రభావం మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మంచి నిద్ర, మానసిక ప్రశాంతత: బిర్యానీ ఆకులో సహజసిద్ధమైన సువాసన నూనెలు ఉంటాయి. రాత్రి పూట వీటి నుండి వచ్చే సన్నని సువాసన మెదడును ప్రశాంతపరిచి, అరోమాథెరపీలా పనిచేసి త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుందని భావిస్తారు.
నొప్పుల నుంచి ఉపశమనం: పాదాల అడుగుభాగంలో ఒత్తిడి బిందువులు ఉంటాయి. ఆకులోని యూజినాల్ అనే కాంపౌండ్ శోథ నిరోధక గుణాలను కలిగి ఉండటం వల్ల కాళ్ల అలసట, నొప్పులు తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది.
యాంటీ బాక్టీరియల్ గుణాలు: బిర్యానీ ఆకులో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పాదాల్లో బాక్టీరియా చేరకుండా చూసి, చెడు వాసన రాకుండా నిరోధిస్తాయి.
ఈ చిట్కా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, దీనికి ఎలాంటి ప్రత్యక్ష శాస్త్రీయ లేదా వైద్య ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. చర్మం ద్వారా బిర్యానీ ఆకులోని గుణాలు శరీరంలోకి చొచ్చుకెళ్లి నొప్పులను తగ్గిస్తాయని చెప్పడానికి పరిశోధనలు లేవు.
అయితే, బిర్యానీ ఆకులో ఉండే సువాసన నరాలను ఉత్తేజపరిచి, మానసిక ఉపశమనాన్ని ఇవ్వడం వల్ల ప్లేసిబో ప్రభావం లేదా అరోమాథెరపీ ప్రభావంతో కొందరికి ఉపశమనం లభించినట్లు అనిపించవచ్చు.
బిర్యానీ ఆకు వల్ల సాధారణంగా ఎలాంటి హాని ఉండదు. కానీ, సెన్సిటివ్ స్కిన్ లేదా చర్మ సమస్యలు, అలెర్జీలు ఉన్నవారు నేరుగా ఆకులను చర్మానికి తాకించేలా పెట్టుకోవడం వల్ల అలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాళ్ల నొప్పులు లేదా తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు ఇటువంటి ప్రత్యామ్నాయ చిట్కాలపైనే ఆధారపడకుండా, సరైన వైద్య సలహా పొందడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..