Overusing Computer : కంప్యూటర్ అతిగా వాడుతున్నారా..! అయితే మీకు ఈ వ్యాధుల బాధ తప్పదు..?

|

Jun 23, 2021 | 10:14 PM

Overusing Computer : ఆధునిక కాలంలో అన్ని కంప్యూటర్ మయం అయిపోయాయి. దీంతో అందరు కంప్యూటర్లతో పనిచేస్తున్నారు.

Overusing Computer : కంప్యూటర్ అతిగా వాడుతున్నారా..! అయితే మీకు ఈ వ్యాధుల బాధ తప్పదు..?
Overusing Computer
Follow us on

Overusing Computer : ఆధునిక కాలంలో అన్ని కంప్యూటర్ మయం అయిపోయాయి. దీంతో అందరు కంప్యూటర్లతో పనిచేస్తున్నారు. విద్యార్థులతో మొదలుకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు మొత్తం కంప్యూటర్‌తోనే పని జరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడంతో మనిషి చాలా రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ముఖ్యంగా కంప్యూటర్‌తో పనిచేసేవాళ్లు తదేకంగా స్క్రీన్ చూడటం వల్ల చాలా కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కండ్లలో నీరు ఇంకిపోవడంతో కొన్ని సమయాలలో తల తిరిగినట్టు అనిపించడం, తీవ్రమైన తల నొప్పి వంటివి వస్తుంటాయి.

సాధారణంగా కండ్లు బ్లింక్‌ చేయడం ఎంతో ముఖ్యం. నిమిషానికి కంటి రెప్పలు 18 సార్లు కొట్టుకుంటాయి. దాని వల్ల కంటిలో ఉండే పలుచని పొరలా ఉన్న ద్రవం మన కంటి గుడ్డుకు కంటి రెప్పలకూ మధ్య లూబ్రికెంట్‌ అవుతూ ఉంటుంది. అయితే మనం కంప్యూటర్‌ను తదేకంగా చూస్తున్నప్పుడు 8-10 సార్లు మాత్రమే కంటి రెప్పలు కొట్టుకుంటాయని, దీనివల్ల కంటిలోని నీరు ఇంకిపోయి కండ్లు పొడిబారతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు వంటివాటిని ఎక్కువగా వాడడం వల్ల వాటినుంచి వచ్చే రేడియేషన్‌ ప్రభావం తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది.

కండ్ల అలసటగా ఉండటం, మాసకబారడం, పొడి బారడం, తలనొప్పితో ఇబ్బంది పడటం, భుజాలు, మెడ నొప్పులు రావడం, ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ అంటారు. ఉదాహరణకి కంప్యూటర్‌ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్‌ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌’ వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు అమెరికాలో జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి ‘టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌’ సోకే ప్రమాదం ఉంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని ‘స్విస్‌’ అధ్యయనంలో తేలిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది.

HFDC Bank : ఐటీ, ఇన్‌ఫ్రాను మెరుగుపరిచే దిశలో హెచ్‌ఎఫ్‌డిసి..! అందుకోసం 500 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటన..

Garlic Good Antidote : పంటి నొప్పికి వెల్లుల్లి మంచి విరుగుడు..! ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

Threat With Salt : ఉప్పుతో పెద్ద ముప్పు..! ఇమ్యూనిటీ పెరగడానికి అడ్డు పడుతుందా..? ఒక వ్యక్తి రోజు ఎంత ఉప్పు తీసుకోవాలి..