Healthy Life: టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా..! కాబట్టి వెంటనే ఆపండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా..?

|

Mar 14, 2024 | 8:10 AM

మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. సంతృప్తి చెందినప్పుడు తినడం మానేయండి. టీవీ, ఫోన్ లేదా కంప్యూటర్ వైపు చూడకుండా నిశ్శబ్ద వాతావరణంలో తినడానికి ప్రయత్నించండి. కేవలం ఆహారం మీద దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన చిరుతిండిని ఎంపిక చేసుకోండి. మీరు టీవీ ముందు ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

Healthy Life: టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా..! కాబట్టి వెంటనే ఆపండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా..?
Eating While Watching Tv
Follow us on

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య సమస్యలు మనల్ని వేధిస్తూనే ఉన్నాయి. బిజీ వర్క్, ట్రావెల్ కాకుండా ఖాళీ సమయాల్లో ఫోన్‌లో నిమగ్నమవుతుంటాం. ఆఖరికి తీరికగా భోజనం చేసే సమయం కూడా లేదు. చాలా మందికి ఇష్టమైన రీళ్లు లేదా సినిమాలు చూస్తూ తినే అలవాటు ఉంటుంది. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి..

* ఆహారంపై ధ్యానం లేకుండా ఉంటారు..

టీవీ చూస్తూ తినడం సరదాగా ఉంటుంది. కానీ, అది అనారోగ్యానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీవీ చూస్తుంటే మనసు చెదిరిపోతుంది. ఎంత తిండి తింటున్నామనే ధ్యాస ఉండదు. ‘పక్కన తింటూనే సినిమాని ఎంతో ఆసక్తిగా చూస్తుంటే ఆకలి, నిండుతనం అనే సంకేతాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

* ఊబకాయం వచ్చే ప్రమాదం

టీవీ చూస్తూ తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్ తీసుకోవడం, సంతృప్తిని గ్రహించడం తగ్గడం, టీవీ చూడటం వల్ల శారీరక శ్రమ తగ్గడం వల్ల కాలక్రమేణా బరువు పెరుగుతారు.

* భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు..

ఆహారం తినే ముందు లోతైన శ్వాస తీసుకోండి. ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. తినే ముందు ఆహారం రంగు, వాసనను గమనించండి. ఇది తినడంపై ఇంద్రియాలను కేంద్రీకరిస్తుంది. ఆహారాన్ని నమిలి నెమ్మదిగా మింగాలి, రుచిని ఆస్వాదించాలి.

* ఆహారం మీద దృష్టి పెట్టండి

శరీరం ఆకలి, సంపూర్ణత్వం సంకేతాలపై దృష్టి పెట్టాలి. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. సంతృప్తి చెందినప్పుడు తినడం మానేయండి. టీవీ, ఫోన్ లేదా కంప్యూటర్ వైపు చూడకుండా నిశ్శబ్ద వాతావరణంలో తినడానికి ప్రయత్నించండి. కేవలం ఆహారం మీద దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన చిరుతిండిని ఎంపిక చేసుకోండి. మీరు టీవీ ముందు ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

* శరీరం ప్రతిచర్యను గమనించాలి

విభిన్న ఆహారాలు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఎలా అనుభూతి చెందుతాయో గమనించండి. వివిధ ఆహారాలకు శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోండి. ఆహారాన్ని దృష్టిలో ఉంచుకుని భోజన సమయంలో క్రమం తప్పకుండా తినండి.

* శరీరానికి పోషణ

ఈ ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా అనుసరించడం ఆహారంతో లోతైన సంబంధాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. శరీరానికి తగినంత పోషకాహారం అందుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ దశలను అనుసరించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి