రోజూ వాడే సబ్బుతో చర్మానికి ముప్పు.. సరైన సబ్బును ఇలా ఎంచుకోండి!

రోజూ ఉదయాన్నే స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అయితే, స్నానం చేయడానికి మనం ఉపయోగించే సబ్బు మన చర్మ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. కేవలం మంచి సువాసన వస్తుందనో లేదా టీవీ ప్రకటనల్లో చూసో సబ్బులను కొనుగోలు చేయడం అస్సలు సరికాదు. వైద్యుల ప్రకారం, ప్రతీ ఒక్కరి చర్మ తత్వం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి మన చర్మానికి సరిపోయే సబ్బును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ వాడే సబ్బుతో చర్మానికి ముప్పు.. సరైన సబ్బును ఇలా ఎంచుకోండి!
Best Bathing Soap

Updated on: Sep 29, 2026 | 11:50 AM

రోజూ ఉదయాన్నే స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అయితే, స్నానం చేయడానికి మనం ఉపయోగించే సబ్బు మన చర్మ ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. కేవలం మంచి సువాసన వస్తుందనో లేదా టీవీ ప్రకటనల్లో చూసో సబ్బులను కొనుగోలు చేయడం అస్సలు సరికాదు. వైద్యుల ప్రకారం, ప్రతీ ఒక్కరి చర్మ తత్వం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి మన చర్మానికి సరిపోయే సబ్బును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ తత్వాన్ని బట్టి సబ్బు ఎంపిక:

పొడి చర్మం: మీది పొడి చర్మం అయితే గ్లిజరిన్, కొబ్బరినూనె, షియా బటర్, బాదం నూనె లేదా అలోవెరా కలిగిన మోయిశ్చరైజింగ్ సబ్బులను ఎంచుకోవాలి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి.

జిడ్డు చర్మం: జిడ్డు చర్మం ఉన్నవారు వేప, టీ ట్రీ ఆయిల్, తులసి లేదా శనగపిండి ఆధారిత సబ్బులను ఉపయోగించాలి. ఇవి చర్మంపై పేరుకుపోయే అధిక నూనెను, రంధ్రాలలోని మురికిని తొలగిస్తాయి.

ఇవి కూడా చదవండి

సున్నితమైన చర్మం: సున్నితమైన చర్మం ఉన్నవారు మైల్డ్ లేదా ఆయుర్వేద సబ్బులను మాత్రమే వాడాలి.

TFM (Total Fatty Matter) పరిశీలించండి:

సబ్బు ప్యాకెట్ వెనుక TFM అని ముద్రించి ఉంటుంది. TFM శాతం ఎక్కువగా ఉంటే ఆ సబ్బు చర్మానికి అంత మంచిది.

గ్రేడ్ 1 సబ్బులు: TFM 76శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని గ్రేడ్ 1 సబ్బులు అంటారు. ఇవి చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి.

గ్రేడ్ 2, 3 సబ్బులు: TFM తక్కువగా ఉండే సబ్బులలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి చర్మానికి హాని చేస్తాయి.

హానికర రసాయనాలకు దూరంగా ఉండండి:

సబ్బు కొనేటప్పుడు అందులో పారాబెన్లు, సల్ఫేట్లు, కృత్రిమ సువాసనలు, ఆల్కహాల్ లేకుంటే చాలా మంచిది. అధిక రసాయనాలు ఉన్న సబ్బులు వాడటం వల్ల చర్మంపై అలర్జీలు, దురద మరియు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

సబ్బు అనేది కేవలం మురికిని తొలగించడానికి మాత్రమే కాకుండా చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడే సాధనం. అందుకే ప్రకటనల వ్యామోహంలో పడకుండా వైద్యుల సలహా మేరకు మీ చర్మానికి సరిపోయే సరైన సబ్బును ఎంచుకుని చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us