
మెరిసే అందమైన, పట్టులాంటి చర్మం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, వాతావరణ కాలుష్యం, దుమ్ము దూళి కారణంగా చాలా మంది అనేక రకాలైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అంతేకాదు.. ఎండాకాలంలో ఇలాంటి చర్మ సమస్యలు మరింత ఇబ్బందిపెడుతుంటాయి. చర్మం మంట, ఎర్రబడటం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అలాంటి వారికి పసుపు, చందనంతో చక్కటి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చందనం, పసుపు కలయిక చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. ఈ మిశ్రమం నల్ల మచ్చలను తొలగిస్తాయి.
పసుపు, చందనం చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించే చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం యాంటీఆక్సిడెంట్ వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. చందనం చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ఎండ వల్ల కలిగే దద్దుర్లు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు, చందనం పేస్ట్‌ను తయారుచేయడానికి మొదట పసుపు, చందనం పొడిని సమపాళ్లలో కలిపి, అందులో కొద్దిగా పాలు లేదా నీరు వేసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి. వారానికి 2 సార్లు వాడవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..