
ఆలోచించడం అనేది అంతులేని ప్రవాహం లాంటిది. అది ఎప్పటికీ అలా పోతునే ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుందంటే… ఉదాహరణకు ఏదైనా విషయం గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వస్తారు. చివరి నిర్ణయం తీసుకున్నాక అక్కడితో ఆ విషయం ముగించాలి. కానీ ఓవర్ థింకింగ్ లో అలా కాదు. డెసిషన్ తీసుకున్నాక మళ్లీ డెసిషన్ మీద ప్రశ్న వస్తుంది. లేనిపోని భయాలు మొదలవుతాయి. అయితే ఇలాంటి ఓవర్ థింకింగ్ తో చాలానే నష్టాలున్నాంటున్నారు డాక్టర్లు
ఓవర్ థింకింగ్ అనేది అంతపెద్ద మెంటల్ డిజార్డర్ కాకపోయినా ఒకరకమైన మానసిక సమస్యగానే చూడాలి. ఎందుకంటే… ఓవర్ థింకింగ్ మెదడుని పూర్తిగా పిండి చేస్తుంది. సరైన లాజిక్ లేకుండా ఆలోచిస్తూ ఉండడం వల్ల మెదడు తన పనితనాన్ని పోగొట్టుకుంటుంది. దాంతో ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వస్తాయి. అతిగా ఆలోచించడం వ్యక్తిగత ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపుతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అవసరమైన, చేయాల్సిన పనులు పైన దృష్టి నిలపడం కష్టంగా మారుతుంది. ఓవర్ థింకింగ్ చేసేవారు ఈజీగా డిప్రెషన్‌కి లోనవుతారు. అలాంటి వాళ్లకు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అతిగా ఆలోచించడం వల్ల మెదుడులో విశ్లేషణాత్మక శక్తి తగ్గిపోతుంది. బ్రెయిన్ చాలా సులభంగా అలసిపోతుంది. ఏదైనా పని చేయాలన్నా మోటివేషన్ కూడా రాదు, ఊరికే చిరాకుగా అనిపిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..