Alcohol: మద్యం ప్రియులు ఏ సమయాల్లో ఎక్కువగా తాగుతారు? పగలా ? రాత్రా? పరిశోధనలో ఏం తేలిందంటే..

|

May 12, 2024 | 7:13 PM

ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య పెరిగిపోతోంది. రికార్డ్‌ స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. కొందరికైతే మద్యం లేనిది రోజు గడవదు. అయితే కొందరు పగలు తాగితే.. మరి కొందరు రాత్రి పూట మాత్రమే తాగుతుంటారు. మరి కొందరేమో పగలు, రాత్రి తేడా లేకుండా ఉదయం నుంచే తాగుడు మొదలు పెడతారు. అది రాత్రి వరకు కూడా కొనసాగుతుంటుంది. అయితే పగలు మద్యం..

Alcohol: మద్యం ప్రియులు ఏ సమయాల్లో ఎక్కువగా తాగుతారు? పగలా ? రాత్రా? పరిశోధనలో ఏం తేలిందంటే..
Alcohol
Follow us on

ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య పెరిగిపోతోంది. రికార్డ్‌ స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. కొందరికైతే మద్యం లేనిది రోజు గడవదు. అయితే కొందరు పగలు తాగితే.. మరి కొందరు రాత్రి పూట మాత్రమే తాగుతుంటారు. మరి కొందరేమో పగలు, రాత్రి తేడా లేకుండా ఉదయం నుంచే తాగుడు మొదలు పెడతారు. అది రాత్రి వరకు కూడా కొనసాగుతుంటుంది. అయితే పగలు మద్యం తాగేవారు, రాత్రి తాగేవారిపై పరిశోధన జరిగింది. పగలు, రాత్రి సమయాల్లో ఎవరు ఎక్కువ తాగుతున్నారన్నదానిపై పరిశోధన జరిగింది.

పరిశోధన ఏం చెబుతోంది?

ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ యూనివర్శిటీలో న్యూట్రిషన్ సైన్స్ ప్రొఫెసర్ డార్డారియన్, ఆమె బృందం దీనిపై పరిశోధన చేసి పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ మద్యం తాగుతున్నట్లు గుర్తించారు. న్యూయార్క్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన నివేదికలో ప్రజలు రోజులో తక్కువ మద్యం సేవిస్తారని చెప్పారు. ఎందుకంటే పగటిపూట ఆహారం తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు. దీని కారణంగా మద్యం అధికంగా తాగడానికి కడుపులో తగినంత స్థలం ఉండదు. అదే సమయంలో ప్రజలు రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకుంటారు. అందుకే రాత్రిపూట ఎక్కువ మద్యం తీసుకుంటారు.

పగలు – రాత్రి మద్యానికి సంబంధం ఏంటి?

ఆల్కహాల్ కడుపులోకి ప్రవేశించిన వెంటనే, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అప్పుడు క్రమంగా మన పేగులు ఆల్కహాల్‌ను గ్రహించడం ప్రారంభిస్తాయి. కొన్ని నిమిషాల తర్వాత అది మన మెదడును ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మనకు మత్తుగా అనిపిస్తుంది. ఆల్కహాల్ పరిమాణం అధికంగా ఉన్నప్పుడు, అది మెదడు మధ్య భాగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. క్రమంగా వ్యక్తి తన నియంత్రణను కోల్పోతుంటాడు. ఇప్పుడు జనాలు మద్యం పగటిపూట ఎక్కువ తాగుతున్నారా? లేదా రాత్రి పూట తాగుతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి పగలు, రాత్రి మత్తుతో సంబంధం లేదు. అయితే పైన పేర్కొన్న రీసెర్చ్ రిపోర్టు ప్రకారం.. పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని, అందుకే పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా మద్యం మత్తులో ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి