ఏడాది లాంగ్ సమ్మర్ ఉంది. జూన్ మాసం అయిపోతున్నా ఎండలు పూర్తి స్థాయిలో తగ్గలేదు. అక్కడక్కడ వర్షాలు పడుతున్నా.. వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడలేదు. దీంతో ఇంకా ఏసీల వినియోగం అధికంగానే ఉంటోంది. అయితే అతిగా ఏసీ వాడే వారికి ఓ షాకింగ్ న్యూస్. రోజూ ఏసీలు వాడేవారు కూడా వడదెబ్బకు గురవతారని మీకు తెలుసా? నిజం అండి బాబు.. మధ్యాహ్నం సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు.. అప్పటి వరకూ ఏసీ లో ఉండి సడన్ గా బయటకు వచ్చారనుకోండి మీకు వడ దెబ్బ తగిలే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. దాని నుంచి ఎలా బయటపడాలి? చేయాల్సిన పనులేంటి? చేయకూడదనివి ఏంటి? తెలుసుకుందాం రండి..
సాధారణంగా ఎయిర్ కండిషనింగ్ ఉన్న గదిలో బయట కంటే 15 నుండి 20 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఎక్కువ సేపు ఇలాంటి వాతావరణంలో ఉండి.. ఒకేసారి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లారనుకోండి.. మీ శరీరం అంతా సడన్ చేంజ్ ని తట్టుకోలేదు. వాస్తవానికి వేడి ఎక్కువ అయ్యి.. గాలి తక్కువ అయితే శరీరం చెమటను బయటకు పంపిస్తుంది. కానీ మీరు అప్పటి వరకూ ఏసీలో ఉండి వచ్చారు కాబట్టి చర్మం పొడిబారిపోతుంది. చెమట పట్టదు. చెమట బయటకు రావడానికి చాలా కష్టతరం అవుతుంది. దీని వల్ల వృద్ధులు, పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు బాగా ప్రభావితం అవుతారు. చెమట పట్టే మెకానిజం శరీరంలో సక్రమంగా పనిచేయని కారణంగా హీట్ స్ట్రోక్ కి గురవుతారు. లేదా హీట్ హైపర్‌పైరెక్సియాను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు కూడా హాని చేస్తుంది. ఈ నేపథ్యంలో హీట్ స్ట్రోక్ ని నివారించడానికి చేయాల్సినవి.. చేయకూడని పనుల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..