Acne Problem
చాలా మంది ముఖంపై మొటిమలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇతరులకన్నా అందంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . అయితే వాతావరణం మారుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వేసవిలో ఎండ వేడిమి కారణంగా, చర్మం నల్లబడటం, ముడతలు, మొటిమలు, వాపు సమస్య, చర్మం చికాకు మొదలైనవి. మొటిమలు, దాని మచ్చలు ముఖం అందాన్ని పాడు చేస్తాయి. అందుకే ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించవచ్చు.
- మొటిమలను నయం చేయడంలో పసుపు, తులసి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రెండు చెంచాల పచ్చి పసుపు, ముప్పై తులసి ఆకులను కడిగి మెత్తగా చేయాలి. ఈ పేస్ట్‌ని మొటిమల మీద రాసి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమల సమస్యలు దూరమవుతాయి.
- వేప ఆకుల్లో మంచి క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఈ వేప ఆకులను చూర్ణం చేసి, వాటిని రెండు చెంచాల రోజ్ వాటర్‌తో మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు ఉంటాయి.
- ఒక చెంచా స్వచ్ఛమైన తేనెను చిన్న దూదిలో ముంచి మొటిమల మీద ఉంచి అరగంట తర్వాత కడిగితే ఫలితం ఉంటుంది.
- గంధం మొటిమలకు ఉత్తమ ఔషధంగా చెబుతారు. గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి మందపాటి పేస్ట్‌లా చేసి మొటిమల మీద రాస్తే చల్లదనం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మొటిమల సమస్యల నుంచి బయటపడవచ్చు.
- రెండు చెంచాల నీళ్లలో కొద్ది మొత్తంలో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ నానబెట్టి మొటిమలపై ఉంచితే మొటిమలు త్వరగా ఆరిపోతాయి. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసాన్ని చర్మానికి ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి