Research: మనిషి యంగ్ ఏజ్‌లో ఉన్నట్లు మలి వయసులో ఆరోగ్యంగ ఉండరనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే శారీరకంగా వచ్చే మార్పులను అడ్డుకోవడం ఎవరి చేతుల్లో ఉండదు. కానీ మానసికంగా వచ్చే సమస్యలను మాత్రం కంట్రోల్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారంగా ముసలి వయసులో ఆలోచన శక్తి తగ్గుతుంది. మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది, మతిమరుపులాంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే చిన్నతనంలో సంగీతం నేర్చుకున్న వారి మెదడు వృద్ధాప్యంలో చురుకుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదేదో ఊరికే చెబుతున్నవిషయం కాదు కొంత మందిపై పరిశోధనలు నిర్వహించిన తర్వాత వెల్లడించిన నిజాలు. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో నిర్వహించిన పరిశోధనల్లో తేలిన ఈ అంశాలను సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. సంగీత వాయిద్యాలను ఉపయోగించడంలో అనుభవం ఉన్న వారు, అనుభవం లేని వారితో పోలిస్తే అభిజ్ఞా సామర్థ్యం పరీక్షలో (బ్రెయిన్ టెస్ట్) మంచి ఫలితాలను చూపించారని పరిశోధనలో తేలింది. వృద్ధాప్యంలో ఆరోగ్యం సంగీత అనుభవం వల్లే ప్రభావితమయ్యాయని అధ్యయనంలో వెల్లడించారు.
ఇందులో భాగంగా 366 మంది పరిగణలోకి తీసుకోగా వారిలో 117 మంది సంగీత వాయిద్యాలను వాయించిన వారు ఉన్నారని నివేదికలో వెల్లడించారు. వీరు ఎక్కువగా బాల్యం, కౌమారదశలో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో అనుబంధం ఉన్నట్లు తెలిపారు. చూశారుగా పెద్దలూ.. మీ పిల్లలను వెంటనే మ్యూజిక్ క్లాస్‌లకు పంపించేయండి మరి.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..