
బాత్రూమ్ దుర్వాసనకు ప్రధాన కారణం తేమ సరిగ్గా గాలి ఆడకపోవడం. బేకింగ్ సోడా, వెనిగర్ వంటి పదార్థాలు చెడు వాసనలను పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, యూకలిప్టస్ లేదా లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం వల్ల బాత్రూమ్ ఒక స్పాలా మారిపోతుంది. సహజ సిద్ధమైన మొక్కలు ఉత్తేజిత బొగ్గు వంటి చిట్కాలు పాటించడం ద్వారా గాలిని శుద్ధి చేసుకోవచ్చు. మీ బాత్రూమ్‌ను ఫ్రెష్‌గా ఉంచే ఆ 9 అద్భుతమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
బాత్రూమ్ సువాసన కోసం పాటించాల్సిన చిట్కాలు:
వంట సోడా : బేకింగ్ సోడాతో నిండిన ఒక గిన్నెను బాత్రూమ్ మూలలో ఉంచండి. ఇది గాలిలోని చెడు వాసనలను పీల్చుకుంటుంది.
వెనిగర్ స్ప్రే: నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి నేలపై స్ప్రే చేయండి. ఇది దుర్వాసనను తగ్గించడమే కాకుండా శుభ్రతకు కూడా సహాయపడుతుంది.
నిమ్మకాయ మ్యాజిక్: నిమ్మరసంలో నీళ్లు కలిపి అప్పుడప్పుడు పిచికారీ చేయండి. దీనివల్ల బాత్రూమ్ అంతా తాజా నిమ్మ సువాసన వెదజల్లుతుంది.
ఎసెన్షియల్ ఆయిల్స్: లావెండర్ లేదా యూకలిప్టస్ ఆయిల్ చుక్కలను నీటిలో కలిపి వాడటం వల్ల మంచి సువాసన లభిస్తుంది.
మొక్కల పెంపకం: పీస్ లిల్లీస్ లేదా స్నేక్ ప్లాంట్స్ వంటి ఇండోర్ మొక్కలు గాలిని శుద్ధి చేసి దుర్వాసనను తగ్గిస్తాయి.
సుగంధ ద్రవ్యాల నీరు: లవంగాలు, దాల్చిన చెక్క మరియు నారింజ తొక్కలతో మరిగించిన నీటిని బాత్రూమ్‌లో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
వెంటిలేషన్: ప్రతిరోజూ కిటికీలు తెరవడం లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం వల్ల తేమ తగ్గుతుంది.
ఉత్తేజిత బొగ్గు : ఒక గిన్నెలో యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉంచండి. ఇది తేమను, దుర్వాసనను సమర్థవంతంగా గ్రహిస్తుంది.
తడి బట్టలు వద్దు: బాత్రూమ్‌లో తడి బట్టలు లేదా తడి తువ్వాలను ఉంచకండి, ఇవే దుర్వాసనకు ప్రధాన కారణమవుతాయి.