AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్చరిక.. ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వంట గదిలో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదు. తక్కువ సమయంలో వంట పూర్తి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ, అదే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా అది బాంబులా పేలి ప్రాణ నష్టానికి దారితీయవచ్చు. కుక్కర్ పేలడానికి గల కారణాలను విశ్లేషిస్తే, మనం చేసే కొన్ని సాధారణ తప్పులే ప్రమాదాలకు మూలమని తెలుస్తోంది. ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి పాటించాల్సిన 5 ముఖ్యమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Apr 28, 2026 | 4:52 PM

Share
కుక్కర్‌ను పూర్తిగా నింపవద్దు: వంటింట్లో ప్రెషర్ కుక్కర్ వాడకం అనేది సమయాన్ని, గ్యాస్‌ను ఆదా చేసే గొప్ప పద్ధతి. అయితే, దీనిని అజాగ్రత్తగా వాడితే అది ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. చాలామంది త్వరగా వంట అయిపోవాలని కుకర్ నిండా ఆహార పదార్థాలను వేస్తుంటారు. కానీ, కుక్కర్ సామర్థ్యంలో 2/3 వంతుకు మించి ఎప్పుడూ నింపకూడదు. ముఖ్యంగా పప్పులు, బియ్యం వంటివి ఉడికేటప్పుడు పొంగుతాయి. కాబట్టి, వాటిని సగం వరకు మాత్రమే నింపడం సురక్షితం.

1 / 5
గ్యాస్కెట్ (రబ్బరు) నాణ్యత: కుక్కర్ మూతకు ఉండే రబ్బరు వదులుగా ఉన్నా లేదా పగుళ్లు ఉన్నా వెంటనే మార్చాలి. సరిగ్గా లేని గ్యాస్కెట్ వల్ల ఆవిరి పక్కల నుండి లీక్ అయ్యి లోపల తగినంత ఒత్తిడి ఏర్పడదు లేదా ప్రమాదకరంగా మారుతుంది.

2 / 5
నీటి పరిమాణం: కుక్కర్‌లో తగినంత నీరు లేకుండా వంట చేయడం చాలా ప్రమాదకరం. నీరు లేకపోతే కుకర్ అడుగుభాగం అతిగా వేడెక్కి సేఫ్టీ వాల్వ్ పేలిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి వండే పదార్థాన్ని బట్టి సరైన మోతాదులో నీటిని పోయాలి.

3 / 5
వెంట్ పైపు శుభ్రత: ప్రెషర్ కుక్కర్ మూతపై ఉండే వెంట్ పైపు (విజిల్ కింద ఉండే రంధ్రం) ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అందులో ఆహార కణాలు ఇరుక్కుపోతే లోపల ఏర్పడిన ఆవిరి బయటకు వెళ్లదు. దీనివల్ల లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది.

4 / 5
బలవంతంగా మూత తీయకండి:  అలాగే, కుక్కర్‌ ప్రెషర్ పూర్తిగా తగ్గకముందే మూతను బలవంతంగా తీయడానికి ప్రయత్నించకూడదు. వంట పూర్తయిన వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకూడదు. విజిల్ తీసివేసినా లోపల ఇంకా ఆవిరి మిగిలి ఉండవచ్చు. ప్రెషర్ పూర్తిగా తగ్గినట్లు నిర్ధారించుకున్న తర్వాతే మూత తీయాలి. ఈ ఐదు జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వంట గదిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ కుక్కర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండండి.

5 / 5
Follow Us
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..

8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!

నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య

భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్

హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..

చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి

అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!

జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం