కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు!

| Edited By: Pardhasaradhi Peri

Jul 05, 2019 | 5:06 PM

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని ఆయన చెప్పారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై […]

కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు!
Follow us on

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని ఆయన చెప్పారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

300 కీమీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అన్నారు… అందులో విజయవాడ, విశాఖపట్నంలో ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేదు… ఇందులో కూడా ఏపీకి అన్యాయం చేశారని విజయసాయి పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ ఒకటే చేస్తామనడం, డ్వాక్రా మహిళకు లక్ష రూపాయలు లోన్ ఇస్తామని చెప్పడం అభినందనియమని ఆయన అన్నారు. డబ్బు దోచుకొని విదేశాలకు వెళ్లిన వాళ్ల దగ్గర నుంచి డబ్బుని వెనక్కి తీసుకోని వస్తే చాలమంచిదని విజయసాయి తెలిపారు.