నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శల పరంపర, “..ఆశ్చర్యపోకండి.. పిచ్చిముదిరింది” అంటూ హాట్ కామెంట్లు

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సంచలన కామెంట్లు చేశారు. నిన్న..

నిమ్మగడ్డపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శల పరంపర, ..ఆశ్చర్యపోకండి.. పిచ్చిముదిరింది అంటూ హాట్ కామెంట్లు
Ambati Rambabu

Updated on: Jan 29, 2021 | 2:56 PM

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సంచలన కామెంట్లు చేశారు. నిన్న ప్రెస్ మీట్ లో నేరుగా నిమ్మగడ్డపై విమర్శలు, సెటైర్లు వేసిన అంబటి ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు గుప్పించారు. “తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. “పిచ్చిముదిరింది”. అంటూ అంబటి రాంబాబు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు సుముఖంగా లేమని జగన్ సర్కారు చెప్పినా, ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక కీలక పరిణామాల మధ్య వైసీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మూకుమ్మడి దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.

Follow Us