నాలుగో రాజధానిగా రాజమండ్రి.. ఏపీ మంత్రి సంచలన డిమాండ్

| Edited By:

Jan 11, 2020 | 4:51 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా సెగ రాజుకుంది. కొందరు అయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు నేతలైతే ఎవరికి తోచినట్లు వారు సరికొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఏపీకి నాలుగవ రాజధానిగా తిరుపతిని చేయాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. వెంకన్న కొలువుండే తిరుపతిని ఏపీకి ఆధ్యాత్మిక రాజధానిని చేయాలంటూ సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి […]

నాలుగో రాజధానిగా రాజమండ్రి.. ఏపీ మంత్రి సంచలన డిమాండ్
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా సెగ రాజుకుంది. కొందరు అయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు నేతలైతే ఎవరికి తోచినట్లు వారు సరికొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ఏపీకి నాలుగవ రాజధానిగా తిరుపతిని చేయాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. వెంకన్న కొలువుండే తిరుపతిని ఏపీకి ఆధ్యాత్మిక రాజధానిని చేయాలంటూ సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేయడమే కాకుండా తిరుపతి సాక్షిగా పోరాటానికి కూడా దిగారు. అయితే ఇప్పుడు ఏపీకి నాలుగో రాజధానిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ రాజమండ్రిలో ర్యాలీ చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 4వ రాజధానిగా రాజమండ్రిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడం కష్టతరమన్న ఆయన ఒకవేళ అక్కడే రాజధానిని నిర్మించాలంటే లక్షా ఐదు వేల కోట్లు ఖర్చవుతుందని స్పష్టం చేశారు.

ఏపీకి మూడు రాజధానుల కంటే నాలుగు ఉంటేనే బాగుటుందని శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. సాంస్కృతిక రాజధానిగా రాజమండ్రిని చేయాలన్న ఆయన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. కాగా, ఇలా నేతలు ఎవరికి వారు కొత్త ప్రతిపాదనలను తీసుకొస్తున్నారు.