ఇక బాబుతో కష్టం..ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి

|

Apr 17, 2019 | 12:43 PM

ఏపీలో పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించిన వైసీపీ నేత రామచంద్రయ్య… రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు చంద్రబాబు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు… రికార్డులను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని… వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన రామచంద్రయ్య… పరిస్థితులు అదుపులో ఉండాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయినా… రాజకీయ వాతావరణం మాత్రం ఇంకా హాట్ […]

ఇక బాబుతో కష్టం..ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి
Follow us on

ఏపీలో పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించిన వైసీపీ నేత రామచంద్రయ్య… రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు చంద్రబాబు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు… రికార్డులను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని… వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన రామచంద్రయ్య… పరిస్థితులు అదుపులో ఉండాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయినా… రాజకీయ వాతావరణం మాత్రం ఇంకా హాట్ హాట్‌గానే కొనసాగుతోంది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధంతో వేడి రగులుతుంది. ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుంటే … ఆయన తీరును తప్పుబడుతూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికలు పూర్తయిన తరువాత కొందరు నేతలపై కేసులు నమోదు కావడం… పోలీసు అధికారులపై విపక్షాలు విమర్శలు చేస్తుండటంతో ఫలితాల వరకు ఈ రాజకీయ వేడి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.