‘వైఎస్సార్ చేయూత’.. ఆ నాలుగు కులాల వారికి గుడ్ న్యూస్..

|

Sep 09, 2020 | 5:18 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్సార్ చేయూత’ పధకంలో మరో నాలుగు కులాలను కూడా చేర్చారు.

వైఎస్సార్ చేయూత.. ఆ నాలుగు కులాల వారికి గుడ్ న్యూస్..
Follow us on

YSR Cheyutha Scheme: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ‘వైఎస్సార్ చేయూత’ పధకంలో మరో నాలుగు కులాలను కూడా చేర్చారు. బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కుల ధృవీకరణ పత్రం అవసరం లేకుండానే చేయూత పధకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నాలుగు కులాల వారు కుల ధృవీకరణ పత్రం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రం లేకపోవడం వల్ల ఈ నాలుగు కులాల వారిలో కొంతమంది అర్హత ఉండి కూడా చేయూత పధకం కింద లబ్ది పొందలేకపోతున్నారని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో జగన్ ఆదేశాల మేరకు ఆయా కులాల్లో అర్హులను గుర్తించే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు.

కాగా, వైఎస్సార్ చేయూత పధకం కింద లబ్దిదారులుగా ఎంపికైన 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తారు. ఈ పధకాన్ని ప్రభుత్వం గత నెల 12వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!