110 సీట్లు పక్కా..జగనే సీఎం- అవంతి శ్రీనివాస్

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని చెప్పారు వైసీపీ నేత అవంతి శ్రీనివాస్. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అవంతి శ్రీనివాస్ కి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ […]

110 సీట్లు పక్కా..జగనే సీఎం- అవంతి శ్రీనివాస్

Edited By:

Updated on: Apr 14, 2019 | 2:07 PM

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని చెప్పారు వైసీపీ నేత అవంతి శ్రీనివాస్. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అవంతి శ్రీనివాస్ కి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి…స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడారు.  110 నుంచి 120  అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పారు. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.