పబ్లిగ్గా బాధపడ్డ జగన్.. ఎందుకో తెలిస్తే మీరూ ఫీలవుతారు !

| Edited By: Srinu

Nov 21, 2019 | 5:05 PM

ప్రజాక్షేత్రంలో పనిచేసే వారు అభినందనలు, పొగడ్తలనే కాదు ఒక్కోసారి విమర్శలను, ఆరోపణలను భరించాల్సి వస్తుంది. కానీ ఏదైనా శృతిమించితేనే ఇబ్బందికరంగా మారుతుంది. ఎంత మంచి పని చేసినా దాన్ని విమర్శించే వారు వుండరు అనుకోవడానికి వీలు లేని పరిస్థితి. అలా మంచి పనులు చేస్తున్నా విమర్శించే వాళ్ళు అదే పనిగా అనవసర రాద్ధాంతం చేస్తుంటే దాన్ని భరించడం కష్టమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలెత్తినట్లుంది. అందుకే ఆయన పబ్లిగ్గా […]

పబ్లిగ్గా బాధపడ్డ జగన్.. ఎందుకో తెలిస్తే మీరూ ఫీలవుతారు !
Follow us on

ప్రజాక్షేత్రంలో పనిచేసే వారు అభినందనలు, పొగడ్తలనే కాదు ఒక్కోసారి విమర్శలను, ఆరోపణలను భరించాల్సి వస్తుంది. కానీ ఏదైనా శృతిమించితేనే ఇబ్బందికరంగా మారుతుంది. ఎంత మంచి పని చేసినా దాన్ని విమర్శించే వారు వుండరు అనుకోవడానికి వీలు లేని పరిస్థితి. అలా మంచి పనులు చేస్తున్నా విమర్శించే వాళ్ళు అదే పనిగా అనవసర రాద్ధాంతం చేస్తుంటే దాన్ని భరించడం కష్టమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలెత్తినట్లుంది. అందుకే ఆయన పబ్లిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ ప్రజలకోసం గొప్ప గొప్ప పనులు చేస్తున్నా నిందలు వేస్తున్నారు.. అపనిందలు వేస్తున్నారు.. దుష్ప్రచారం చేస్తున్నారు.. ప్రజల కోసం చేయదగ్గ మంచిని మీ బిడ్డగా చేస్తున్నా.. ఎంతమంది శత్రువులు ఏకమైనా, ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడ గలుగుతా..’’ ఇవి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సభలో సీఎం వైయస్‌ జగన్‌ అన్న మాటలు.

ఈ మాటలు విన్న ఎవరికైనా ఇట్టే అర్థమయ్యేది ముఖ్యమంత్రి ఆవేదన. కానీ ప్రజాక్షేత్రంలో అందునా రాజకీయాల్లో వున్నప్పుడు ఇవన్నీ తప్పని పరిస్థితి. వాటికి వీలైనంత స్థాయిలో తగిన విధంగా స్పందించడం తప్ప రాజకీయాల్లో ఏమీ చేయలేని పరిస్థితి వుంటుంది.

గత ఆరు నెలల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకొచ్చిన సీఎం జగన్‌ అయినా సరే అపనిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చెడూ చేయకపోయినా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

వెనకబడ్డ తరగతులు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, వారంతా రాష్ట్రాభివృద్ధికి బ్యాక్‌ బోన్స్ అని చాటేందుకు తాపత్రయపడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే వెనకబడ్డ వారు కాదు, వాళ్లని ముందడుగులోకి తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నానని, అలా ఆరాటపడ్డమే నేను చేసిన తప్పు అన్నట్టుగా ఈరోజు దుష్ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి తన బాధను వక్తం చేశారు.

ఇలా తప్పుగా మాట్లాడుతున్న నాయకులను, తప్పుగా రాస్తున్న పత్రికాధిపతుల్ని ప్రజలు ప్రశ్నించాలని జగన్ పిలుపునిచ్చారు. ‘‘ మీకేమో పిల్లలకేమో ఇంగ్లీషు మీడియం, మా పిల్లలకేమో తెలుగు మీడియం అనడం భావ్యమేనా’’ అని అడగండని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.