రొట్టె నచ్చలేదన్న అన్నను చంపి.. తమ్ముడి ఆత్మహత్య

|

Aug 24, 2020 | 12:09 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణం జరిగింది. భోజనంలో రొట్టే నచ్చలేదన్న అన్నను హత్య చేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధూమ‌న్‌‌‌గంజ్ ప‌రిధిలోని పంతర్వా గ్రామానికి చెందిన చోటు (18) తన అన్నయ్య జితేంద్ర (25)ను ఇటుకతో మోది హ‌త్య చేశాడు. తరువాత తమ్ముడు చోటు రైలుకు ఎదురుగా వెళ్లి, ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

రొట్టె నచ్చలేదన్న అన్నను చంపి.. తమ్ముడి ఆత్మహత్య
Follow us on

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణం జరిగింది. భోజనంలో రొట్టే నచ్చలేదన్న అన్నను హత్య చేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధూమ‌న్‌‌‌గంజ్ ప‌రిధిలోని పంతర్వా గ్రామానికి చెందిన చోటు (18) తన అన్నయ్య జితేంద్ర (25)ను ఇటుకతో మోది హ‌త్య చేశాడు. తరువాత తమ్ముడు చోటు రైలుకు ఎదురుగా వెళ్లి, ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

పంత‌ర్వా గ్రామానికి చెందిన ర‌మేష్‌కు ఇద్ద‌రు కుమారులు.పెద్ద కుమారుడు జితేంద్ర ట్రాక్టర్ నడుపుతుండగా, చిన్నకొడుకు చోటు తండ్రికి వ్యవసాయంలో స‌హాయం చేస్తుంటాడు. ఇదే క్రమంలో జితేంద్ర రాత్రి ఇంటికి వచ్చి, ఆహారం పెట్టాల‌ని తల్లిని అడిగాడు. దీంతో అతనికి ఆమె రొట్టె అందించింది. దీనిని చూడ‌గానే జితేంద్ర త‌ల్లితో రొట్టె న‌చ్చ‌లేదంటూ గొడ‌వ ప‌డ్డాడు. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న చోటు త‌న అన్న‌ జితేంద్ర తలపై ఇటుకతో బ‌లంగా మోదాడు. తీవ్రంగా గాయపడ్డ జితేంద్ర అక్క‌డిక‌క్క‌డే కుప్పకూలి మృతిచెందాడు. ఇది గ‌మ‌నించిన చోటు రైలుకు ఎదురుగా వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ధూమ‌న్‌‌గంజ్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జితేంద్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సోదరుడు చోటు మృతదేహం రైల్వే ట్రాక్‌పై గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.