అమ్మో..! తాగుబోతుల క్రియేటివిటీ

|

Aug 08, 2020 | 4:53 PM

మద్యం రవాణలో అనంత కోటి ఉపాయాలను వెతుకుంటున్నారు అక్రమార్కులు. మందు కోసం తాగుబోతులు తమ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. పోలీసులకు దొరకకుండా క్రియేటీని ఉపయోగిస్తున్నారు. బురఖాలు ధరించి మహిళలుగా నమ్మించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. బురఖా చాటున మద్యం బాటిల్స్ దాచుకుని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయారు. అయితే కర్నూలు జిల్లా నుంచి జోగులాంబ జిల్లాకు మద్యం కోసం వచ్చిన కొందరు సరిహద్దు జిల్లాల్లో దొరికిపోయారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని మందు షాపుల్లో మద్యం కొనుకుని తిరిగి వెళ్తుండగా […]

అమ్మో..! తాగుబోతుల క్రియేటివిటీ
Follow us on

మద్యం రవాణలో అనంత కోటి ఉపాయాలను వెతుకుంటున్నారు అక్రమార్కులు. మందు కోసం తాగుబోతులు తమ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. పోలీసులకు దొరకకుండా క్రియేటీని ఉపయోగిస్తున్నారు. బురఖాలు ధరించి మహిళలుగా నమ్మించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. బురఖా చాటున మద్యం బాటిల్స్ దాచుకుని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయారు.

అయితే కర్నూలు జిల్లా నుంచి జోగులాంబ జిల్లాకు మద్యం కోసం వచ్చిన కొందరు సరిహద్దు జిల్లాల్లో దొరికిపోయారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని మందు షాపుల్లో మద్యం కొనుకుని తిరిగి వెళ్తుండగా వారి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. బురఖలో ఉన్నది మహిళ కాదు పురుషుడు అని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. తనిఖీలు నిర్వహించారు. దీంతో వారి నుంచి పెద్ద ఎత్తున మద్యం లభించింది. ఇక్కడ కొనుగోలు చేసిన మద్యంను ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా కర్నూలులో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.