“మహర్షి” ఫ్లెక్సీ తీసింది అభిమాని ప్రాణం..

| Edited By:

May 09, 2019 | 11:53 AM

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో “మహర్షి” సినిమా ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. మహేష్ అభిమాని అయిన రాజీవ్.. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. బుధవారం రాత్రి స్థానిక మురళీకృష్ణ థియేటర్‌లో ఫ్లెక్సీలు కడుతుండగా.. అక్కడి విద్యుత్ తీగలు తగిలి  తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని […]

మహర్షి ఫ్లెక్సీ తీసింది అభిమాని ప్రాణం..
Follow us on

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో “మహర్షి” సినిమా ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. మహేష్ అభిమాని అయిన రాజీవ్.. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. బుధవారం రాత్రి స్థానిక మురళీకృష్ణ థియేటర్‌లో ఫ్లెక్సీలు కడుతుండగా.. అక్కడి విద్యుత్ తీగలు తగిలి  తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.