తల్లిదండ్రులతో గొడవ, కొడుకు ఆత్మహత్య

అమ్మానాన్నలతో గొడవ పడ్డ కొడుకు మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బల్కంపేటలో జరిగింది.

తల్లిదండ్రులతో గొడవ,  కొడుకు ఆత్మహత్య

Updated on: Sep 28, 2020 | 7:29 PM

అమ్మానాన్నలతో గొడవ పడ్డ కొడుకు మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బల్కంపేటలో జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా దివిలి చంద్రంపల్లి గ్రామానికి చెందిన చింతాకుల త్రిమూర్తులు కుటుంబం రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది.  త్రిమూర్తులు ఎస్సార్‌నగర్‌ ఎస్సార్టీలో వాచ్‌మన్‌గా వర్క్  చేస్తున్నాడు. అతడి తనయుడు సురేష్‌(20) బల్కంపేటలో డీజే షాపులో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత మిత్రులతో కలిసి బీజేఆర్‌నగర్‌లో రూంలోనే నిద్రపోతుండేవాడు. అయితే ఏడాది క్రితం అతడి ఫ్రెండ్స్ రూమ్ ఖాళీ చేయడంతో అప్పటినుంచి అమ్మానాన్నల వద్ద ఉంటున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నప్పుడు జల్సాలకు అలవాటుపడ్డ సురేష్.. డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రుల్ని వేధించేవాడు. ఇటీవల లాక్‌డౌన్‌ వల్ల పనులు లేకపోవడంతో డబ్బులివ్వాలని తల్లిదండ్రులను రోజూ టార్చర్ పెట్టేవాడు.

వారు డబ్బులు ఇవ్వకపోవడంతో బీజేఆర్‌నగర్‌లో పాత రూమ్‌ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి లేటుగా వెళ్లడంతో ఇంటి ఓనర్ గేటు తీయలేదు. రాత్రంతా బయట గడిపిన సురేష్‌ ఉదయం గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం అవుతున్నా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి ఓనర్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : RRvsKXIP: క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫీల్డింగ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

Loading...
Unable to load recommendations.
Follow Us