
young boy in kadapa current shock: కడప జిల్లా మైదుకూరు పట్టణంలో దారుణం జరిగింది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలుడు ట్రాన్స్‌టాఫర్మర్ల మధ్య పడ్డ బంతిని తీసుకురావడానికి వెళ్లాడు. ట్రాన్స్ ఫార్మర్ బాలుడి ఒంటికి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కడప రోడ్డులో ఉన్న వ్యవసాయ శాఖ కార్యలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలుడు మైదుకూరు మండలం అన్నలూరు పంచాయతీ చౌటపల్లెకు చెందిన పాల వ్యాపారి బసీర్ కొడుకు షోహెల్ అని సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై అంటుకున్న మంటలను ఆర్పడానికి మట్టి చల్లుతూ, గోనె సంచి సహాయంతో బాలుడిని కిందికి దించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.