మూడు గంటలు దాటితే.. ఇక ఫైనే..

|

Jun 12, 2019 | 4:49 PM

ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ వద్దకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే తాజ్ మహల్ పరిరక్షణను పరిగణలోకి తీసుకుని ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తాజ్ మహల్ వద్ద మూడుగంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ సందర్శకులను నియంత్రించడానికి వీలుగా 14 గేట్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు లోపలకు వచ్చిన […]

మూడు గంటలు దాటితే.. ఇక ఫైనే..
Follow us on

ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ వద్దకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే తాజ్ మహల్ పరిరక్షణను పరిగణలోకి తీసుకుని ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తాజ్ మహల్ వద్ద మూడుగంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ సందర్శకులను నియంత్రించడానికి వీలుగా 14 గేట్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు లోపలకు వచ్చిన తర్వాత కేవలం మూడు గంటలపాటు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టారు. తాజ్ వద్ద అధిక సమయం ఉంటే వారికి ఎగ్జిట్ గేటు వద్ద జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ సూపరింటెండెంట్ వసంత్ స్వరాంకర్ చెప్పారు.