గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ హవా.. భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన యూపీ సీఎం యోగి

హైదరాబాద్ మహానగర ఎన్నికల్లోనూ కమలం వికసించడంతో కమలనాథులు సంతోషం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ హవా..  భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన యూపీ సీఎం యోగి
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 05, 2020 | 7:05 AM

ghmc election results 2020: హైదరాబాద్ మహానగర ఎన్నికల్లోనూ కమలం వికసించడంతో కమలనాథులు సంతోషం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. గ్రేటర్ చరిత్రలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లోవిజయం సాధించడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు యోగి కృతజ్ఞతలు తెలిపారు.‘‘హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం, ప్రధానమంత్రి మోదీజీ నాయకత్వంపై అపూర్వమైన విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు’’ అంటూ యోగి తెలిపారు. సీఎం యోగి ఎన్నికల ప్రచారం తాము హైదరాబాద్‌ను భాగ్యనగర్ గా మారుస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది.