ఇంత సీక్రెట్ ఏంటి బాబూ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిసినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి రామోజీని కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ‘ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని […]

ఇంత సీక్రెట్ ఏంటి బాబూ?

Edited By:

Updated on: May 16, 2019 | 4:54 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిసినట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి రామోజీని కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ‘ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?’ అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా విమర్శించారు.