‘బుల్ బుల్’ వస్తోంది..బీ కేర్‌ఫుల్..!

|

Nov 08, 2019 | 4:48 AM

బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు, మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం 11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా […]

బుల్ బుల్ వస్తోంది..బీ కేర్‌ఫుల్..!
Follow us on

బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు, మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం 11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ముందు జాగ్రత్తగా వెస్ట్ బెంగాల్. ఒరిస్సా రాష్ట్రాలలో 35 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్‌ను రంగంలోకి దించారు.

ఈ నెల 9న (శనివారం) ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి, ఆ తర్వాత ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్‌‌,  బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావం కోస్తాపై కూడా వుండే అవకాశం వుండటంతో అన్ని ప్రధాన పోర్ట్ లను అప్రమత్తం చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ‘బుల్‌ బుల్‌’ తుఫానుతో ఏపీలోని అన్ని పోర్టుల్లో 2వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు.

కాగా అక్టోబర్ నెలలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 63 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, అల్పపీడనాలు, ఉపతల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది.