కలుపు మొక్కల ఏరివేతకే.. యామిని డైలాగ్ అదిరింది

|

Jan 04, 2020 | 5:20 PM

చాలా రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాధినేని యామిని శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో కడప జిల్లాలో యామిని కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పౌరసత్వ చట్ట సవరణపై నికార్సయిన కామెంట్ చేశారు. దేశంలోకి విచ్చలవిడిగా చొచ్చుకు వచ్చి ఇక్కడ అక్రమంగా స్థిరపడిన కలుపు మొక్కల ఏరివేతకే నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించిందని యామిని అన్నారు. కలుపు మొక్కల […]

కలుపు మొక్కల ఏరివేతకే.. యామిని డైలాగ్ అదిరింది
Follow us on

చాలా రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాధినేని యామిని శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో కడప జిల్లాలో యామిని కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పౌరసత్వ చట్ట సవరణపై నికార్సయిన కామెంట్ చేశారు.

దేశంలోకి విచ్చలవిడిగా చొచ్చుకు వచ్చి ఇక్కడ అక్రమంగా స్థిరపడిన కలుపు మొక్కల ఏరివేతకే నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించిందని యామిని అన్నారు. కలుపు మొక్కల తరపున కాంగ్రెస్ పార్టీ వకల్తా పుచ్చుకోవడం వింతగా వుందని ఆమె అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్య‌మని యామిని చెబుతున్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దికి బీజేపి కట్టుబడి ఉందని, అందుకోసమే తన వంతు సాయంగా బిజేపిలో చేరానని ఆమె వివరించారు. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలలో వారసత్వ, కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని, వాటిని పొగొట్టుకోనంత కాలం ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పుకొచ్చారు యామిని.