ఏపీకి థర్డ్ యంగస్ట్ సీఎంగా జగన్..!

ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ఆర్సీపీ ఏపీ ఎన్నికల్లో మేజికల్ ఫిగర్‌ను అందుకోగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక ఏపీ సీఎం పదవిని చేపట్టే వారిలో జగన్ మూడో పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ వయసు 46 సంవత్సరాల ఆరు నెలలు. ఇది వరకు కేవలం ఇద్దరు మాత్రం ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే వారిలో ఒకరు చంద్రబాబు కావడం గమనార్హం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన వయసు 45 సంవత్సరాల అయిదు […]

ఏపీకి థర్డ్ యంగస్ట్ సీఎంగా జగన్..!

Edited By:

Updated on: May 25, 2019 | 6:49 PM

ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ఆర్సీపీ ఏపీ ఎన్నికల్లో మేజికల్ ఫిగర్‌ను అందుకోగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక ఏపీ సీఎం పదవిని చేపట్టే వారిలో జగన్ మూడో పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ వయసు 46 సంవత్సరాల ఆరు నెలలు. ఇది వరకు కేవలం ఇద్దరు మాత్రం ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే వారిలో ఒకరు చంద్రబాబు కావడం గమనార్హం.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన వయసు 45 సంవత్సరాల అయిదు నెలలు. అప్పట్లో ఆయన ఎన్టీఆర్ అల్లుడి హోదాలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక ఏపీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఎన్నికైనది దామోదరం సంజీవయ్య. ఆయన కేవలం 38 సంవత్సరాల 11 నెలల వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.

మరోవైపు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన వయసు దాదాపు యాభై నాలుగు సంవత్సరాలు పై మాటే. ఆయనతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అవుతున్నారు.