ఇదేంటబ్బా! ‘ఫేమస్ లవర్‌’పై అప్పుడే కాపీ మరక!

రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమాకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గాయపడిన మొహంతో కోపం నిండిన కళ్ళతో గుప్పుమని పొగ వదులుతూ సిగరెట్ పట్టుకున్న పోస్టర్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. అంతేకాకుండా చాలామంది నెటిజన్లు మరో అర్జున్ రెడ్డి లాంటి క్లాసిక్ మూవీ అనుకుంటున్నారు. ఇక రౌడీ ఫాలోయింగ్ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ టైటిల్‌కు ఇప్పటికే భారీ క్రేజ్ లభించింది. […]

ఇదేంటబ్బా! ఫేమస్ లవర్‌పై అప్పుడే కాపీ మరక!

Updated on: Sep 22, 2019 | 12:21 PM

రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమాకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గాయపడిన మొహంతో కోపం నిండిన కళ్ళతో గుప్పుమని పొగ వదులుతూ సిగరెట్ పట్టుకున్న పోస్టర్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. అంతేకాకుండా చాలామంది నెటిజన్లు మరో అర్జున్ రెడ్డి లాంటి క్లాసిక్ మూవీ అనుకుంటున్నారు. ఇక రౌడీ ఫాలోయింగ్ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ టైటిల్‌కు ఇప్పటికే భారీ క్రేజ్ లభించింది. అయితే ఇక్కడే అనుకోకుండా ఓ ట్విస్ట్ వచ్చింది.

ఈ పోస్టర్ కూడా కాపీనే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ మొదలుపెట్టారు. నాలుగేళ్ళ కిందట అంటే 2015లో టెక్సాస్‌కు చెందిన లారెన్ విత్రో అనే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లుక్‌నే అటూ.. ఇటూగా మార్చి విజయ్ దేవరకొండతో రిపీట్ చేయించారన్న మాట వినిపిస్తోంది. కథలను కాపీ కొడుతుండటం చూస్తూనే ఉన్నాం.. పోస్టర్లను సైతం చోరీ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ గానీ.. దర్శకుడు గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రాశి ఖన్నా, క్యాథరిన్ థెరసా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Follow Us