కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ప్రసక్తే లేదు, రవి శంకర్ ప్రసాద్

370 అధికరణం కింద జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. దాన్ని పునరుద్దరించే అవకాశాలు లేవన్నారు. ఈ అధికరణాన్ని పునరుధ్దరించాలన్న పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తి డిమాండును ఆయన తొసిపుచ్చారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే 370 ఆర్టికల్ ని కేంద్రం గత ఏడాది రద్దు చేసిందని, దాన్ని పార్లమెంటు కూడా మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదించిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా-ఈ ఆర్టికల్ ని […]

కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ప్రసక్తే లేదు, రవి శంకర్ ప్రసాద్

Edited By:

Updated on: Oct 24, 2020 | 9:49 PM

370 అధికరణం కింద జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. దాన్ని పునరుద్దరించే అవకాశాలు లేవన్నారు. ఈ అధికరణాన్ని పునరుధ్దరించాలన్న పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తి డిమాండును ఆయన తొసిపుచ్చారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే 370 ఆర్టికల్ ని కేంద్రం గత ఏడాది రద్దు చేసిందని, దాన్ని పార్లమెంటు కూడా మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదించిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా-ఈ ఆర్టికల్ ని పునరుధ్ధరించేంతవరకు తను పోరాడతానని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా ఇటీవల ప్రకటించారు.

 

 

Follow Us