వివాహితపై సామూహిక లైంగిక దాడి.. హత్య

|

Nov 05, 2020 | 3:00 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మానవ మృగాల ఆగడాలు ఆగట్లేదు. మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

వివాహితపై సామూహిక లైంగిక దాడి.. హత్య
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మానవ మృగాల ఆగడాలు ఆగట్లేదు. మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రతి నిత్యం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. వావి-వరుసలు లేని మృగాల చేతుల్లో అబలలు బలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగర శివారులో ఓ వివాహితను దారుణంగా సామూహికంగా లైంగికదాడికి పాల్పడి హతమార్చారు దుండగులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు తండా శివారులో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో దుర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే, భోజ్య తండాకు చెందిన పత్లోత్ ల‌త‌(30) అనే వివాహిత మంగ‌ళ‌వారం రాత్రి అదృశ్య‌మైంది. మియాపూర్‌లోని త‌న త‌ల్లిగారింటికి వెళ్తుండ‌గా ఆమెను ముగ్గురు వ్య‌క్తులు అప‌హ‌రించారు. ల‌త ఇంటికి రాక‌పోవ‌డంతో.. ఆమె సోద‌రుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ల‌త మృత‌దేహాన్ని గురువారం ఉద‌యం తండా శివారులోని రేకుల షెడ్డులో స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారమిచ్చారు. దీంతో రామ‌చంద్రాపురం పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ల‌త మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే తండాకు చెందిన మ‌ధు నాయ‌క్‌తోపాటు కొల్లూరుకు చెందిన నందు యాద‌వ్‌, కుటుంబరెడ్డి అనే ముగ్గురు క‌లిసి మహిళను అప‌హ‌రించిన‌ట్లు స‌మాచారం. ల‌త‌కు మార్గ‌మ‌ధ్య‌లోనే మ‌ద్యం తాగించి.. రేకుల షెడ్డు వ‌ద్ద‌ సామూహికంగా లైంగిక‌దాడికి పాల్ప‌డిన‌ట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచింది. ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.