ట్రైన్‌లో ట్రాప్..ఆపై లాడ్జ్‌కు తీసుకువెళ్లి..

|

Jan 20, 2020 | 3:39 PM

సమాజంలో బూచోళ్లున్నారు జాగ్రత్త. మహిళలను మాయమాటలతో ట్రాప్‌ చేస్తారు. అదును చూసి చిరుతలాగా పంజా విసురుతారు. ఎన్ని చట్టాలు వస్తోన్న మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రైన్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్న వ్యక్తి , బండి దిగగానే తనలోని పశుతత్వాన్ని ప్రదర్శించాడు. తన ప్రెండ్‌తో ముందుగానే పక్కా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి..స్టేషన్ పక్కనే ఓ హోటల్ రూమ్‌ని బుక్ చేశాడు. అక్కడికి తీసుకువెళ్లి […]

ట్రైన్‌లో ట్రాప్..ఆపై లాడ్జ్‌కు తీసుకువెళ్లి..
Follow us on

సమాజంలో బూచోళ్లున్నారు జాగ్రత్త. మహిళలను మాయమాటలతో ట్రాప్‌ చేస్తారు. అదును చూసి చిరుతలాగా పంజా విసురుతారు. ఎన్ని చట్టాలు వస్తోన్న మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్రైన్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్న వ్యక్తి , బండి దిగగానే తనలోని పశుతత్వాన్ని ప్రదర్శించాడు. తన ప్రెండ్‌తో ముందుగానే పక్కా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి..స్టేషన్ పక్కనే ఓ హోటల్ రూమ్‌ని బుక్ చేశాడు. అక్కడికి తీసుకువెళ్లి ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేసి.. జారుకున్నారు ఇద్దరు మ‌ృగాళ్లు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..పూజ అనే యువతి జాబ్ కోసం మహారాష్ట్ర నుంచి నగరానికి ట్రైన్‌లో వస్తుండగా..మధ్యలో వివేకానంద అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి, తన ఫ్రెండ్ రాజుతో కలిసి..రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ కృష్ణ లాడ్జికి తీసుకెల్లి  అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులపై సెక్షన్  376, 506 కింద కేసులు నమోదు చేసి..గాలింపు చర్యలు ప్రారంభించారు.