మానవత్వానికే మాయని మచ్చ!

| Edited By:

Apr 17, 2019 | 2:19 PM

నాగపూర్‌లో ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ప్రియుడితో కలిసి కిరాతకంగా చంపిందో కూతురు. తనకే పాపం తెలియదంటూ బుకాయించింది. చివరికి కథ అడ్డం తిరగడంతో ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయింది. నాగపూర్‌లోని వాడికి చెందిన శంకర్ దంపతులు.. తమకు పిల్లలు లేకపోవడంతో ప్రియాంకను దత్తత తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రియాంక.. స్టేట్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అఖ్లాక్‌‌తో ప్రేమలో పడింది. పెద్దల్ని ఒప్పించి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈలోపు ప్రియాంక తండ్రి తన ఆస్తిని అమ్మకానికి […]

మానవత్వానికే మాయని మచ్చ!
Follow us on

నాగపూర్‌లో ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ప్రియుడితో కలిసి కిరాతకంగా చంపిందో కూతురు. తనకే పాపం తెలియదంటూ బుకాయించింది. చివరికి కథ అడ్డం తిరగడంతో ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయింది.

నాగపూర్‌లోని వాడికి చెందిన శంకర్ దంపతులు.. తమకు పిల్లలు లేకపోవడంతో ప్రియాంకను దత్తత తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రియాంక.. స్టేట్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అఖ్లాక్‌‌తో ప్రేమలో పడింది. పెద్దల్ని ఒప్పించి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈలోపు ప్రియాంక తండ్రి తన ఆస్తిని అమ్మకానికి పెట్టాడు. ఆ ఆస్తి తనకు దక్కదని ఆమెలో ఆందోళన మొదలయ్యింది. ప్రియుడు ఖాన్‌కు చెప్పి ఆస్తి గురించి వివరించింది.

తన క్రిమినల్ బుర్రకు పదును పెట్టిన ఖాన్.. ప్రియాంక తల్లిదండ్రుల హత్యకు స్కెచ్ వేశాడు. వాళ్లిద్దర్ని అడ్డు తొలగించుకుంటే ఆస్తి దక్కుతుందని ప్లాన్ వేశాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రియాంక బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి బయటకెళ్లింది. తర్వాత మొహానికి మాస్క్ కట్టుకొని ఇంట్లోకి చొరబడిన ఖాన్.. శంకర్, సీమా దంపతులపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు దొంగల పనిగా భావించినా.. అనుమానంతో ప్రియాంకను ప్రశ్నించారు పోలీసులు. పోలీసుల విచారణలో ప్రియాంక తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రుల్ని చంపినట్లు ఒప్పుకుంది.