వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నిత్యం మద్యం మత్తులో వేధిస్తున్న భర్తను వదిలించుకోవలనుకుంది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య.

  • Balaraju Goud
  • Publish Date - 2:12 pm, Sun, 3 January 21
వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం మద్యం మత్తులో వేధిస్తున్న భర్తను వదిలించుకోవలనుకుంది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య. కీసర పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక విజయ హాస్పిటల్ ఎదురుగా ఉన్న స్థలంలో శ్యామ్, సరోజ దంపతులు వాచ్‌మెన్ జీవనోపాధి సాగిస్తున్నారు. భర్త శ్యామ్ రోజు మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య ఇవాళ తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన భార్య చివరకు భర్తను హతమార్చింది. రోకలితో భర్త శ్యామ్ తలపై బలంగా మోదడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.