రైతాంగానికి గోరుచుట్టుపై రోకలిపోటు.. బురేవి తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

|

Dec 02, 2020 | 5:11 AM

ఇప్పటికే నివర్ తుఫానుతో అతలాకుతలమైన ఆంధ్రా రైతాంగానికి బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడ్డ బురేవి తుఫాన్‌ కూడా గోరుచుట్టుపై రోకలిపోటులా మారబోతోంది...

రైతాంగానికి గోరుచుట్టుపై రోకలిపోటు.. బురేవి తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
Follow us on

ఇప్పటికే నివర్ తుఫానుతో అతలాకుతలమైన ఆంధ్రా రైతాంగానికి బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడ్డ బురేవి తుఫాన్‌ కూడా గోరుచుట్టుపై రోకలిపోటులా మారబోతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.  రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బురేవి తుపానుగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంకలోని ట్రింకోమలీ తీరానికి తూర్పు, ఆగ్నేయ దిశగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బురేవి తుఫాన్‌ ఇవాళ సాయంత్రం లేదా రాత్రి శ్రీలంక వద్ద తీరాన్ని తాకనుంది. బురేవి ప్రభావంతో డిసెంబరు 2,3 తేదీలలో తమిళనాడు, కేరళతో పాటు దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.