ఎక్కడి విపక్ష నేతలక్కడ గప్‌చుప్! మహాకూటమి తుస్?

|

May 22, 2019 | 9:52 AM

ఎన్నికలు పూర్తైయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాము నమ్ముతామని అని వెల్లడించిన బీజేపీ వ్యతిరేక కూటమిలో ముందు ఉన్న ధీమా ఇప్పుడు కనిపించట్లేదనే చెప్పాలి. మంగళవారం రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది. మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలన్న వారి జోష్ ఇప్పుడు చేతల్లో కనిపించట్లేదు. ఇకపోతే మంగళవారం జరిగిన విపక్షాల […]

ఎక్కడి విపక్ష నేతలక్కడ గప్‌చుప్! మహాకూటమి తుస్?
Follow us on

ఎన్నికలు పూర్తైయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాము నమ్ముతామని అని వెల్లడించిన బీజేపీ వ్యతిరేక కూటమిలో ముందు ఉన్న ధీమా ఇప్పుడు కనిపించట్లేదనే చెప్పాలి. మంగళవారం రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది. మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలన్న వారి జోష్ ఇప్పుడు చేతల్లో కనిపించట్లేదు.

ఇకపోతే మంగళవారం జరిగిన విపక్షాల మీటింగ్‌లో కీలక నేతలంతా హాజరు కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికల ముందు వరకు బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం ఒక్కటీ జరగలేదు. ఎక్కడికక్కడ ఈ పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. కానీ ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, బీజేపీ ధోరణితో అన్ని విపక్షాలు ఏకధాటి మీదకు వచ్చాయి. దీనితో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తొలిసారి మీటింగ్ జరగగా కీలక నేతలందరూ డుమ్మా కొట్టారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీటింగ్‌కు రాకపోగా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా సమావేశంపై వైపు రాలేదు. వెస్ట్ బెంగాల్, కర్ణాటక సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరదపవార్‌లు కూడా ఈ సమావేశానికి గైరాజయ్యారు. కాగా కొన్ని పార్టీలకు సంబంధించి కీలక నేతలు మాత్రమే ఈ మీటింగ్‌కు హాజరవగా… మిగిలిన పార్టీలు తమ ప్రతినిధులను పంపించాయి.

మరోవైపు బీజేపీ వ్యతిరేక కూటమికి ఇది ఆహ్వానించదగిన పరిణామం కాదని విశ్లేషకులు అంటున్నారు. మరి 23 తర్వాత సమీకరణాలు ఏవిధంగా మారతాయో వేచి చూడాలి.