‘ఈసారి అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయనివ్వను’..

|

Aug 20, 2020 | 8:02 PM

మన్కడింగ్‌.. ఈ పేరు వినగానే మొదటిగా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తొస్తాడు. 2019 ఐపీఎల్‌లో జరిగిన ఈ ఘటనను క్రికెట్ ప్రపంచం ఇంకా మర్చిపోలేదు.

ఈసారి అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయనివ్వను..
Follow us on

Ashwin on mankading: మన్కడింగ్‌.. ఈ పేరు వినగానే మొదటిగా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తొస్తాడు. 2019 ఐపీఎల్‌లో జరిగిన ఈ ఘటనను క్రికెట్ ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్.. బట్లర్‌ను మన్కడింగ్‌తో రనౌట్ చేశాడు. అయితే అది అప్పుడు.. ఇప్పుడు అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నాడు. ఇక మన్కడింగ్‌ విషయంపై మాట్లాడిన ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అశ్విన్‌కు స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చాడని చెప్పాలి.

”అశ్విన్‌ను కలవగానే మొదటగా ఈ మన్కడింగ్‌ గురించి మాట్లాడతాను. ఢిల్లీ జట్టులో ఇలాంటి తరహ క్రికెట్ ఆడబోము. ఈ ఏడాది ఐపీఎల్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఎలాంటి ఘటనా జరగదు. గతేడాది అశ్విన్ మా జట్టులో లేడు. కానీ మన్కడింగ్‌ చేసినప్పుడు నేను ఢిల్లీ ఆటగాళ్ళతో మాట్లాడి.. అలాంటివి తప్పని చెప్పాను. అశ్విన్ అద్భుతమైన బౌలర్.. అలాంటి స్థాయి ఆటగాడు మన్కడింగ్‌ చేసినప్పుడు అతన్ని చూసి యువ క్రికెటర్లు ఫాలో అవుతారు. అందుకే అశ్విన్‌ను కలిశాక మొదటిగా మన్కడింగ్‌ గురించే మాట్లాడతాను.” అని పాంటింగ్ తెలిపాడు.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..