‘అల’ మాట ఎత్తని సూపర్ స్టార్.. కారణమిదేనా.?

మరికొన్ని గంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాకు పోటీగా ‘దర్బార్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలు కూడా రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పండగ పోటి తీవ్రతరంగా ఉన్నా.. హీరోల మధ్య మాత్రం స్నేహపూర్వక వాతావరణాన్ని మనం చూస్తూనే […]

అల మాట ఎత్తని సూపర్ స్టార్.. కారణమిదేనా.?

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2020 | 4:21 PM

మరికొన్ని గంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాకు పోటీగా ‘దర్బార్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలు కూడా రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పండగ పోటి తీవ్రతరంగా ఉన్నా.. హీరోల మధ్య మాత్రం స్నేహపూర్వక వాతావరణాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

‘అల’ ఈవెంట్ లో బన్నీ.. ‘ఎంత మంచివాడవురా’ ఈవెంట్‌లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. అలాగే ‘సరిలేరు’ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సినిమాలకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. అద్భుత విజయం సాధించాలని కోరుకున్నారు. కానీ హీరో మహేష్ బాబు మాత్రం మిగతా చిత్రాల గురించి స్పందించకపోవడం ఫ్యాన్స్‌ను కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఇతర సినిమాలపై మీ స్పందన ఏంటని విలేకర్లు మహేష్‌ను ప్రశ్నించగా..

‘సంక్రాంతి పండగ సినిమాలకు చాలా మంచిది. పోటీ లేకుండా గ్యాప్‌తో చిత్రాలు విడుదలయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అంతేకాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు తప్పితే.. స్పెషల్‌గా ఏ సినిమా పేరు కూడా ప్రస్తావించలేదు. దీంతో ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా పేరు ఎందకని మహేష్ ఎత్తడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే త్రివిక్రమ్‌ మహేష్‌ మధ్య చెడిందా.. లేదా సైలెంట్‌గా ఉంటే మంచిదని మహేష్ భావించారా..