చైనా చెప్పింది నిజమే, వూహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ లీక్ కాలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు

| Edited By: Anil kumar poka

Feb 09, 2021 | 5:41 PM

వూహాన్ లోని ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ లీక్ కాలేదన్న చైనా ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సమర్థించారు. ఇక దీనిపై మరింత అధ్యయనం అనవసరమని వారు తెలిపారు.

చైనా చెప్పింది నిజమే, వూహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ లీక్ కాలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు
Follow us on

వూహాన్ లోని ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ లీక్ కాలేదన్న చైనా ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సమర్థించారు. ఇక దీనిపై మరింత అధ్యయనం అనవసరమని వారు తెలిపారు. చైనా లోని వూహాన్ లో తమ స్టడీని పూర్తి చేసినవారు.. 2019 డిసెంబరుకు ముందు వూహాన్ లో గానీ, మరోచోట గానీ వ్యాప్తి చెందలేదన్న బీజింగ్ ప్రకటన సరైనదే అని కితాబిఛ్చారు. అసలు ఈ వైరస్ దేశంలోకి ఎలా ఎంటరయిందన్న దానిపై అధ్యయనం జరగాలని ఈ సంస్థ టీమ్  లీడర్ పీటర్ ఎంబార్క్ పేర్కొన్నారు. వూహాన్ లోని మార్కెట్ లో బహుశా ఘనీభవించిన మాంసం నుంచి ఈ వైరస్ పుట్టి ఉండవచ్చునన్నారు. కానీ ఈ సిటీలోని వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ నుంచే ఇది జనించిందని అమెరికా సహా వివిధ దేశాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఈ కోవిడ్ వైరస్ ఎక్కడినుంచి జనించింది..నేరుగా మనుషులకే సోకిందా అన్న విషయాలను నిర్ధారించడంలో తాము విఫలమయ్యామని పీటర్ అంగీకరించారు.

ఏమైనా మానవుల్లోకి ఇది ఎలా క్రాస్ అయిందన్న దానిపై తాము నాలుగు థియరీలను రూపొందించినట్టు ఆయన తెలిపారు. మొదట కోవిడ్ లక్షణాలు గల జంతువు నుంచి, ఆ తరువాత మధ్యలో మనుషులకు క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న జంతువు నుంచి సంక్రమించి ఉండవచ్చునని తాము భావిస్తున్నామని పీటర్ చెప్పారు. వూహాన్ లో మనుషులు గానీ, గబ్బిలాలు గానీ క్లోజ్ కాంటాక్ట్ లోకి రాలేదని తాము కనుగొన్నామన్నారు. క్రూర మృగాలు, పెంపుడు జంతువులు తదితరాలల్లో వీటినుంచి ఈ మూలం జనించిందన్న దాన్ని తాము తెలుసుకోలేకపోయామని ఆయన అన్నారు. అయితే ఈయన చెప్పిందంతా చైనా అధికారుల ‘ఆదేశాల’ మేరకే ఉన్నట్టు కనబడుతోందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. వారికీ మద్దతుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు మాట్లాడడం విశేషం.

Read More :కోవిడ్ జంతుమూలాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కనుగొనలేకపోయారు, చైనా శాస్త్రజ్ఞుడు

Read More:Corona Test For Animals: ఇక నుంచి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షలు.. ఎక్కడంటే..