సరికొత్త ఫీచర్లతో వస్తున్న వాట్సాప్
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఫోన్‌లో కాంటాక్ట్ నెంబర్ ఫీడ్ చేయాలంటే కీప్యాడ్ ఓపెన్ చేయాలి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఫోన్‌లో కాంటాక్ట్ నెంబర్ ఫీడ్ చేయాలంటే కీప్యాడ్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నెంబర్ టైప్ చేసి…,పేరు కూడా టైప్ చేయాలి. ఆ తర్వాత సేవ్ చేసుకోవాలి. ఇందులో ఒక్కోసారి నెంబర్ తప్పుగా పడటం.. పేరులో పొరపాటు దొర్లటం జరుగుతుంది. ఇలా ఒకట్రెండు నెంబర్లైతే ఓకే. కానీ చాలా నెంబర్లు ఇలా చేయాలంటే ఒకరోజుతో అయ్యే పనికాదు. ఇప్పుడు అలాంటి సమస్యకు చెక్ పెట్టనుంది వాట్సాప్.
ఈ కొత్త ఫీచర్‌తో ఇంతా కష్టపడనవసరం లేదు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్ల ముందుకు తీసుకురానున్నట్లు వాట్సప్ ప్రకటించినది.