ఆ తేడా వస్తే ఎలా..? డౌట్స్ క్లియర్ చేసిన ఈసీ..

| Edited By:

May 09, 2019 | 1:19 PM

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి చూపూ ఎన్నికల ఫలితాల మీదనే. గెలుపు మాదంటే మాదేనని రాజకీయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షనేతలు వీవీప్యాట్‌లోని స్లిప్పులను 5శాతం లెక్కించాలని కోరారు. అయితే.. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త సందేహం తలెత్తింది. ఒకవేళ ఈవీఎంలు, వీవీప్యాట్ ఓట్ల లెక్కింపులో తేడా వస్తే.. ఏం చేస్తారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి కేంద్ర […]

ఆ తేడా వస్తే ఎలా..? డౌట్స్ క్లియర్ చేసిన ఈసీ..
Follow us on

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి చూపూ ఎన్నికల ఫలితాల మీదనే. గెలుపు మాదంటే మాదేనని రాజకీయ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షనేతలు వీవీప్యాట్‌లోని స్లిప్పులను 5శాతం లెక్కించాలని కోరారు. అయితే.. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలోనే మరో కొత్త సందేహం తలెత్తింది. ఒకవేళ ఈవీఎంలు, వీవీప్యాట్ ఓట్ల లెక్కింపులో తేడా వస్తే.. ఏం చేస్తారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీవీప్యాట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు సంఖ్యలో తేడా వస్తే.. అవి సరి పోలేంతవరకూ రీకౌంటింగ్ చేస్తామని.. అయినా ఫలితం లేకపోతే.. వీవీప్యాట్ స్లిప్పుల్లోని సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.