ప్రస్తుతం అందరూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేద్దామా అనే ప్లాన్స్‌లో ఉన్నారు. కొంతమంది పబ్బులు, క్లబ్బులకు వెళ్తే.. మరికొందరు రోడ్లపైనే హంగామా చేస్తారు. పాత సంవత్సారానికి బైబై చెబుతూ.. కొత్త సంవత్సారానికి వెల్‌కమ్ చెబుతూంటారు. అయితే.. అన్నిదేశాల కంటే.. న్యూఇయర్ జరిగేది ఎక్కడో మీకు తెలుసా? మనకి సాయంత్రం సమయం అయ్యే సరికి ఆ దేశంలో నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి. మొదట సూర్యుడు కూడా అడుగుపెట్టేది అక్కడే.
అదెక్కడా అనుకుంటున్నారా.. అదే ‘సమోవా దేశం’. పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దేశం అందరికంటే ముందు ‘కొత్త సంవత్సరం’లోకి అడుగు పెడుతుంది. దీంతో.. అక్కడ సెలెబ్రేషన్స్‌ని ఓ రేంజ్‌లో చేస్తారు. కాగా.. అక్కడ జరిగిన మరో గంటలోపే న్యూజిలాండ్ ప్రజలు ‘న్యూ ఇయర్’ని స్వాగతిస్తారు. అనంతరం సిడ్నీ కూడా కొత్త ఏడాదిని మన కంటే 5 గంటల ముందే ఆహ్వానిస్తుంది. కాగా సిడ్నీలో జరిగే న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా హైలైట్‌గా నిలుస్తాయి. నిజం చెప్పాలంటే.. కొన్ని దేశాల ప్రజలు దీన్ని చూడటానికి అక్కడికి వేలాదిగా చేరుకుంటారు.
కాగా.. సమోవా దేశం తరువాత దాదాపు ఎనిమిదిన్నర గంటలకు మన దేశంలో ‘కొత్త సంవత్సరం’ వస్తుంది. మనతో పాటు శ్రీలంక దేశం కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే.. మన తర్వాత దాదాపు 43 దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, ఐరోపా, కాంగో, అంగోలా, కామెరూన్ వంటి దేశాలన్నీ న్యూఇయర్ వేడుకలని ఒకే సమయంలో చేసుకుంటాయి.
అయితే.. న్యూఇయర్‌ని చివరగా.. ఇంగ్లాండ్, అమెరికా, లండన్‌లలో చేస్తారు. ఇక రష్యాలో రెండు సార్లు న్యూఇయర్‌ని చేసుకుంటారు. అలాగే.. చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాంలు ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరం వేడుకలను చేసుకుంటారు.