‘అల్ ఖైదా ‘పడగతో ఉలిక్కిపడిన బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2020 | 4:25 PM

తమ రాష్ట్రంలో అల్ ఖైదా ఉగ్రవాదులు కొందరిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బాంబుల తయారీకి ఈ రాష్ట్రం అడ్డాగా మారిందని ట్వీట్ చేశారు..

అల్ ఖైదా పడగతో ఉలిక్కిపడిన బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్
Follow us on

తమ రాష్ట్రంలో అల్ ఖైదా ఉగ్రవాదులు కొందరిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బాంబుల తయారీకి ఈ రాష్ట్రం అడ్డాగా మారిందని ట్వీట్ చేశారు. శాంతి భద్రతలు దిగజారుతున్న  నేపథ్యంలో ఈ ప్రభుత్వం తన జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలదన్నారు. బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో కొందరిని, కేరళ లోని ఎర్నాకుళంలో మరికొంతమంది అల్ ఖైదా టెర్రరిస్టులను  ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా సీఎం మమతా బెనర్జీ  ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, డీజీపీ, ఎంతసేపూ తమ రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలతోనే బిజీగా ఉంటున్నారని జగదీప్ ధన్ కర్ ఆరోపించారు. ఇక డీజీపీ అయితే వాస్తవాలకు దూరంగా నడచుకుంటున్నారని, ఆయన వైఖరి ఏ మాత్రం సహేతుకంగా లేదని గవర్నర్ విమర్శించారు. బెంగాల్ లో సీఎం మమత ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఏనాడూ లేవు. తరచూ  వీరి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి.