ముందే ముంచుకొస్తున్న సూపర్ తుఫాన్.. !

అంఫాన్ తుపాన్ ముంచుకొస్తుంది. తీరం వెంబడి బలమైన గాలులతో దూసుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం బలపడి వాయుగుండంగా మారింది. అంఫాన్ తుఫాన్.. మహాతుఫాన్ గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతోంది. ఈ తుఫాన్ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే తుఫాన్ తీరాన్ని తాకడానికి ఒకరోజు ముందే పశ్చిమబెంగాల్ తీరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీరం వెంబడి బలమైన ఈదురు […]

ముందే ముంచుకొస్తున్న సూపర్ తుఫాన్.. !

Updated on: May 19, 2020 | 8:49 PM

అంఫాన్ తుపాన్ ముంచుకొస్తుంది. తీరం వెంబడి బలమైన గాలులతో దూసుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం బలపడి వాయుగుండంగా మారింది. అంఫాన్ తుఫాన్.. మహాతుఫాన్ గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతోంది. ఈ తుఫాన్ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే తుఫాన్ తీరాన్ని తాకడానికి ఒకరోజు ముందే పశ్చిమబెంగాల్ తీరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దట్టమైన మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తున్నది. ఇప్పటికే అప్రమత్తమై కేంద్ర NDRF బృందాలుఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంఫాన్‌’ సూపర్ తుపాన్ తీవ్ర భీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను 1999 తరువాత రెండో అతిపెద్దదని తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో ప్రస్తుతం తీరం వెంబడి 200-240కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ డైరక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు.