రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘ఫొని’ తుఫాన్

| Edited By: Ram Naramaneni

Apr 28, 2019 | 4:57 PM

రెండు తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది.. ఇక ఈ తుఫాన్‌కు ‘ఫొని’ అని నామకరణం చేసింది వాతావరణ శాఖ. ఇది రేపు ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే, దశను కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ ఫణి తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం ఉండదని వాతావరణ […]

రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఫొని తుఫాన్
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది.. ఇక ఈ తుఫాన్‌కు ‘ఫొని’ అని నామకరణం చేసింది వాతావరణ శాఖ. ఇది రేపు ఉత్తర తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే, దశను కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ ఫణి తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నష్టం ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫణి తుఫాన్.. శ్రీలకంలోని ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయంగా 775 కిలోమీటర్లు, చెన్నైకి  ఆగ్నేయంగా 1110 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఫొని తుఫాన్… రాగల 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.