Weather Report: తెలంగాణలో పంజా విసురుతున్న చలి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరీ దారుణ పరిస్థితి..

|

Dec 22, 2020 | 6:09 AM

తెలంగాణ చలి పంజా విసురుతోంది. దక్షిణ కశ్మీరంగా పిలువడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణం అని చెప్పాలి.

Weather Report: తెలంగాణలో పంజా విసురుతున్న చలి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరీ దారుణ పరిస్థితి..
Follow us on

Weather Report: తెలంగాణ చలి పంజా విసురుతోంది. దక్షిణ కశ్మీరంగా పిలువడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణం అని చెప్పాలి. రాత్రైందంటే చాలు చలి మంటలు లేనిదే కునుకు తీయడం లేదు ఆ మారుమూల పల్లెలు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలకు ఆదిలాబాద్ జిల్లా కేరాప్ అడ్రస్ గా నిలుస్తోంది. చుట్టు దట్టమైన అడవులు వాగులు వంకలకు తోడు జీవనదుల ప్రవాహంతో ఆదిలాబాద్ చలి పులికి అడ్డాగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి ( టి ) లో అయితే జనం చలి తీవ్రతను తట్టుకునేందుకు మంటల సాక్షిగా జాగరం చేయకతప్పడం లేదు. ఆ రేంజ్‌లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి మరి.

ఏజెన్సీ వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ ప్రాంతాలైన గిన్నెదరి, సిర్పూర్ (యు), నార్నూర్, ఇంద్రవెళ్లి ఏజెన్సీ మండలాలు, ఆదివాసీ గూడాలు చలికి గజగజ వణుకుతున్నాయి. తిర్యాణి మండలం గిన్నెధరి మినీ కాశ్మీర్ గా మారుతోంది. ఇక్కడ రికార్ట్ స్థాయిలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. గిన్నెధరితో పాటు ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(యు) 6, కెరమిరి 6.7, తిర్యాణి 6.7, వాంకిడి 6.8, మండలాల్లో ఆదిలాబాద్ జిల్లా అర్లి ( టి ) 4.6, భీంపూర్ 4.9, బరంపూర్, తాంసి 4.9, బేలా 5, నేరడిగొండ 5.4, జైనథ్ 5.6, బోరజ్ 6.1, తలమడుగులో 6.4 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 6.2, కుబీర్ 7.3, కుంటాల 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

Also read:

Lottery: అదృష్టం అంటే ఇతనిదేనేమో.. అలా ఉద్యోగం పోయింది.. ఇలా కోట్ల సొమ్ము వచ్చేసింది..

బెంగాల్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. పీకేపై సెటైర్ల వర్షం..