బెంగాల్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. పీకేపై సెటైర్ల వర్షం..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనపై సెటైర్ల మీద సెటైర్లు వేసింది. త్వరలోనే ఓ ఎన్నికల వ్యూహకర్త

బెంగాల్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. పీకేపై సెటైర్ల వర్షం..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 5:31 AM

Bengal Elections: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనపై సెటైర్ల మీద సెటైర్లు వేసింది. త్వరలోనే ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి చేరబోతోందంటూ ఎద్దేవా చేసింది. పశ్చిమబెంగాల్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాజకీయ నేతల కప్పదాట్లు ఓవైపు అయితే.. ముఖ్య నేతల మాటల తూటాలు మరోవైపు పేలుతున్నాయి. ఫలితంగా బెంగాల్ ఎన్నికల పోరు ఇప్పటి నుంచే సరవత్తరంగా మారింది.

అయితే త్వరలో జరగనున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు కూడా రావంటూ తృణమూల్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతేకాదు.. ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ దాటితే తాను ట్విటర్ నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. ఆ మేరకు పీకే ట్వీట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది.

అయితే పీకే ట్వీట్‌పై ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతే స్థాయిలో స్పందించింది. బెంగాల్ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక దేశంలో ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి చేరుతుందంటూ సెటైర్లు కుపించారు. ఆమేరకు బెంగాల్ బీజేపీ ఇన్‌చార్జి కైలాస్ విజయ్ వర్గీయ ట్వీట్ చేశారు. అంతేకాదు.. బెంగాల్‌ ప్రజలంతా బీజేపీతోనే ఉన్నారని, ఇక్కడ బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.